: డిగ్గీ రాజా పెళ్ళి త్వరలోనే!
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన ప్రేయసి అమృతారాయ్ ని వివాహం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే తమ ఇంట పెళ్ళి బాజాలు మోగనున్నాయని దిగ్విజయ్ సోదరుడి భార్య రుబీనా శర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ టీవీ చానల్లో యాంకర్ అయిన అమృతారాయ్ తో తాను ఎప్పటినుంచో ప్రేమాయణం నడుపుతున్నట్టు డిగ్గీ రాజా ఇటీవలే బహిరంగంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆమెను పెళ్ళాడబోతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు.
అమృత, ఆమె భర్త పరస్పర అవగాహనతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, తమ బంధంలో సమస్యలేవీ లేవని స్పష్టం చేశారు. దిగ్విజయ్ సతీమణి క్యాన్సర్ కారణంగా గత ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. దిగ్విజయ్ కు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.