: కృష్ణాడెల్టాకు నీటి విడుదలపై దేవినేని ఉమా వ్యాఖ్యలు
కృష్ణాడెల్టాకు రేపటి నుంచి నీటిని విడుదల చేయాలనే నిర్ణయం ఇప్పటిది కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. జూలై 9వ తేదీ వరకు 10 టీఎంసీల తాగునీటిని విడుదల చేయాలని రాష్ట్రపతి పాలన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. సకాలంలో నీటి విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారని ఉమ అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చే సున్నితమైన అంశాన్ని రాజకీయ వివాదం చేయడం తగదని మంత్రి అభిప్రాయపడ్డారు.