: తదుపరి బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా?
బీజేపీ తదుపరి అధ్యక్షుడిగా అమిత్ షా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పదవికి ఇప్పటి వరకు జేపీ నద్దా పేరు వినిపించింది. అయితే, ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షాయే దీనికి తగిన అభ్యర్థి అని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీకి అమిత్ షా నమ్మకమైన అనుచరుడన్న విషయం తెలిసిందే. నూతన అధ్యక్షుడిపై పార్టీ నుంచి త్వరలోనే నిర్ణయం వెలువడనుందని సమాచారం.