: చంద్రబాబు పట్ల బంధువు ఔదార్యం!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి పట్ల ఆయన బంధువు ఒకరు ఉదారంగా స్పందించారు. ఏపీకి ఇంతవరకు రాజధాని లేకపోగా, విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలుమార్లు విజయవాడ సందర్శించాల్సి వస్తోంది. దీంతో, బాబు కోసం ఆయన బంధువు తన భవనాన్ని కేటాయించారు. ఇకపై చంద్రబాబు బెజవాడ వెళ్ళినప్పుడల్లా ఇక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం, నాగార్జున యూనివర్శిటీకి మధ్య ప్రాంతంలో ఉన్న ఈ రెండంతస్తుల భవనాన్ని నారా లోకేశ్ పలుమార్లు సందర్శించారు.
బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉండేందుకు వీలుగా ఈ భవనానికి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అధిక సామర్థ్యం కలిగిన జనరేటర్ ను ఏర్పాటు చేశారు. భవనం ఎదుట రహదారిపై స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం పూర్తయింది. అధికారులు కూడా ఈ భవనాన్ని పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ భవనానికి సమీపంలో ఓ గ్యారేజి ఉంది. బాబు భద్రత రీత్యా ఇప్పుడా గ్యారేజిని అక్కడి నుంచి తరలించాలని యజమానికి సూచించారు.