: ఇరాక్ లో చిక్కుకున్న 16 మంది విశాఖ జిల్లా వాసులు


ఇరాక్ లో పట్టణాలను దిగ్బంధిస్తూ సున్నీ మిలిటెంట్లు తీవ్ర అల్లర్లు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాకు చెందిన పదహారు మంది ఇరాక్ లో చిక్కుకున్నట్లు తెలిసింది. ఏజెంట్ల మోసంతో వీసాలు, డబ్బుల్లేక వారక్కడే ఉండిపోయారని తహశీల్దారు ద్వారా వివరాలు సేకరించిన రెవెన్యూ శాఖ తెలిపింది. వారిలో యలమంచిలికి చెందిన తొమ్మిది మంది, విశాఖ నగర వాసులు ఐదుగురు, అనకాపల్లి, కసింకోటకు ఇద్దరు ఉన్నారు.

  • Loading...

More Telugu News