: కేంద్ర మాజీ మంత్రి ఇంటి అద్దె రూ.16 లక్షలు!
కేంద్ర టెలికాం మాజీ మంత్రి కపిల్ సిబల్ కొత్త ఇంటి నెల అద్దె ఎంతో వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకోసం ఆయన అక్షరాల 16 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఢిల్లీలోని జోర్ బాగ్ లో లీఫీ లూటెన్స్ లో ఉన్న విలాసవంతమైన బంగళాకు సిబల్ మారబోతున్నారు. దీనికి నెల అద్దె రూపేణా 16 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.