: టీడీపీ ఎమ్మెల్యే గాంధీ అరెస్ట్
హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే, హైటెక్ సిటీ సమీపంలో ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని టి.సీఎం కేసీఆర్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసుల భద్రత మధ్య జీహెచ్ ఎంసీ అధికారులు కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ, కూల్చివేతలను ఎమ్మెల్యే గాంధీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.