: రవి హత్య కేసు నుంచి జగన్ ను కాపాడటానికి ఎంతో కష్టపడాల్సి వస్తోందని కిరణ్ అన్నారు: కాల్వ


ఈ రోజు ఏపీ శాసనసభలో హత్యారాజకీయాలపైకి చర్చ మళ్లింది. వైయస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తలను ఊచకోత కోశారని ఆ పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని టీడీపీ కార్యకర్తలు బతికారని అన్నారు. దాదాపు 400 మంది సమక్షంలో, ఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరంలో పరిటాల రవిని హత్య చేశారని చెప్పారు.

వైయస్ మరణానంతరం ఈ హత్యాకాండను ఎవరు కొనసాగిస్తారో అన్న ఆలోచనలో అనంతపురం వాసులు ఉన్నారని అన్నారు. ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ మాట్లాడుతూ, పరిటాల రవి హత్య కేసు నుంచి జగన్ ను కాపాడటానికి ఎంతో కష్టపడాల్సి వస్తోందని అసెంబ్లీ సాక్షిగా అన్నారని చెప్పారు. ఈ సమయంలో వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మాట్లాడబోయారు. దీంతో, నాగిరెడ్డిగారూ మీరు కూడా హత్యారాజకీయాల గురించి మాట్లాడతారా? అంటూ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News