: మెస్సీ, నేమార్ అలా... రొనాల్డో ఇలా..!
'సాకర్ ప్రపంచంలో ఇంతటి ఖరీదైన ఆటగాడు లేడు' అనిపించే విధంగా పోర్చుగల్ స్టార్ ఫార్వర్డ్ క్రిస్టియానో రొనాల్డో సంపాదన ఉంటుంది. అతడిని ఓ క్లబ్ కొనుగోలు చేయాలంటే, బదలాయింపు ఫీజుల రూపంలోనే రూ.1000 కోట్లకు పైగా చేతులు మారతాయి. అలాంటి ఆటగాడు బ్రెజిల్ వరల్డ్ కప్ లో తమ జట్టును ఒంటిచేత్తో నాకౌట్ దశకు చేరుస్తాడని పోర్చుగల్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆశ్చర్యకరంగా రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేక ఉసూరుమనిపించాడు. దీంతో, అటు అభిమానులు తీవ్ర నిరాశకు లోనవగా, ఇటు పోర్చుగల్ జట్టు గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి!
మరోవైపు సూపర్ ఫార్వర్డ్ ఆటగాళ్ళు లియొనెల్ మెస్సీ, నేమార్ లు తమ తమ జట్లకు అద్భుత విజయాలనందించి తమ స్థాయిని చాటారు. మెస్సీ గోల్ తో ఇరాన్ పై నెగ్గి అర్జెంటీనా నాకౌట్ చేరగా... నేమార్ రెండు గోల్స్ కొట్టడంతో బ్రెజిల్, కామెరూన్ చిత్తు చేసి తుది 16 జట్లలో చోటు సంపాదించింది.