: మైఖేల్ షుమాకర్ మెడికల్ రిపోర్ట్స్ చోరీ!
ఇటీవలే కోమా నుంచి బయటపడిన ఫార్ములా వన్ మాజీ ఛాంపియన్ మైఖేల్ షుమాకర్ కోలుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన మెడికల్ రిపోర్ట్స్ ను కొన్ని రోజుల కిందట ఎవరో చోరీ చేసినట్లు మైఖేల్ మేనేజింగ్ డైరెక్టర్ సబైన్ ఖేమ్ ఓ ప్రకటనలో చెబుతున్నాడు. అంతేకాదు వాటిని అమ్మకానికి కూడా పెట్టినట్టు తెలిపాడు. అయితే, విక్రయించేందుకు చూపిన మెడికల్ ఫైళ్లు విశ్వసనీయమైనవా? కాదా? అనేది చెప్పలేమన్నాడు. మొత్తానికి ఫైళ్లను తెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్టు స్పష్టం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నాడు.