: ఇతర సభ్యులు కూడా తనలాగే ఉంటారని జగన్ అనుకుంటున్నట్టున్నారు: కాల్వ శ్రీనివాసులు


వైకాపా అధినేత జగన్ తన వైఖరి మార్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలబడిన టీడీపీని, చంద్రబాబును విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు మంచి చేసే పనులకు సహకరించాలని హితవు పలికారు. తన తప్పులు, అవినీతి, కుంభకోణాలు అన్నింటినీ... ఇతరులకు కూడా అంటగట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని అన్నారు. హింస, దౌర్జన్యాలు, అవినీతి, కుంభకోణాలు ఇవన్నీ చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో చిత్తుగా ఓడించారని అన్నారు. ఈ సందర్భంగా వైకాపా సభ్యులు గందరగోళానికి దిగారు. 'కాంగ్రెస్ ను అంటే మీకెందుకు బాధ?' అంటూ కాల్వ సెటైర్ విసిరారు.

  • Loading...

More Telugu News