: అంజలి కాల్ లిస్టుపై పోలీసుల దృష్టి
అంజలి మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె చివరిసారిగా నోవాటెల్ హోటల్ నుంచి ఫోన్ లో మాట్లాడిన నేపథ్యంలో అంజలి కాల్ లిస్టుపై పోలీసులు దృష్టి సారించారు. కేసు దర్యాప్తులో భాగంగా అంజలి తల్లి పార్వతీ దేవి నుంచి పలు వివరాలు సేకరించామని వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. అంజలి అదృశ్యం విషయమై టాలీవుడ్ పెద్దలతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. తన సోదరి అంజలి కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు రవిశంకర్ నిన్న కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు ఉదయం అంజలి తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. కానీ, ఆమె ఎక్కడుందన్న వివరాలు తెలియాల్సి ఉంది.