: ఇతర పార్టీల సభ్యులను లాగే ప్రయత్నం చేస్తున్నారు: జగన్
అధికార టీడీపీ చాలా దారుణ చర్యలకు దిగుతోందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ, కాంగ్రెస్, వైకాపాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను టీడీపీ తమ పార్టీలోకి లాక్కుంటోందని విమర్శించారు. ఇటీవలే కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎమ్మెల్సీలను టీడీపీ తమ పార్టీలోకి చేర్చుకుందని అన్నారు. కేవలం ప్రతిపక్షం నోరు నొక్కడానికే ఈ కుతంత్రాలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా ప్రతిపక్షమైన మా నోరు నొక్కగలరేమోగాని... నిజమైన ప్రతిపక్షం మాత్రం ప్రజలేనని... వారి నోరు మాత్రం నొక్కకూడదని... ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు.