: డిక్కీలో డబ్బు కొట్టేశారు


బ్యాంకు నుంచి డ్రా చేసుకుని తీసుకెళ్తున్న 4.5 లక్షల రూపాయల నగదును దుండగులు దోచేశారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు నుంచి కట్టా కృష్ణారావు అనే వ్యక్తి 5 లక్షల రూపాయలు డ్రా చేసి, 50 వేల రూపాయలు జేబులో పెట్టుకుని మిగిలిన (4.5 లక్షలు) మొత్తాన్ని ద్విచక్రవాహనం డిక్కీలో పెట్టారు. మార్గమధ్యంలోని మెడికల్ షాపు వద్ద బండిని నిలిపి మందులు కొనేందుకు వెళ్లారు. ఇంతలో దొంగలు డిక్కీ తాళం తీసి అందులో డబ్బు దొంగిలించారు. ముందుల దుకాణం నుంచి వెనుకకు వచ్చిన ఆయన ద్విచక్రవాహనంలోని డబ్బు మాయమైనట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News