: డ్రగ్ పరీక్షలకు మేం సిద్ధం: కోస్టారికా కోచ్
డ్రగ్ పరీక్షలకు జట్టు సభ్యులంతా సిద్ధంగా ఉన్నారని కోస్టారికా జట్టు కోచ్ జోర్డ్ లూయిస్ పింటో తెలిపారు. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో ఇటలీపై 1-0తో విజయం సాధించిన తరువాత ఏడుగురు కోస్టారికా జట్టు ఆటగాళ్లను డ్రగ్ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా పీఫా ఆదేశించింది. దీంతో ఆట ముగిసిన వెంటనే ఇద్దరు ఆటగాళ్లు డ్రగ్ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, మిగిలిన ఐదుగురు ఆటగాళ్లను నేడు పరీక్షిస్తామని పీఫా తెలిపింది. డ్రగ్ పరీక్షలు రోటిన్ లో భాగమని పీఫా పేర్కొంది. కాగా, కోస్టారికా జట్టు క్రీడా విశ్లేషకుల అంచనాలకు మించి రాణిస్తోంది.