: పోలవరం ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకోవాలి: పొన్నాల
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో పీసీసీ ఎగ్జిక్యూటివ్ లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లతో చర్చలు జరిపామని ఆయన వెల్లడించారు. జూలై 2 ఆంటోనీ కమిటీతో సమావేశమవుతామని ఆయన తెలిపారు.