: దక్షిణ మధ్య రైల్వేలో టీటీఈలు కావలెను!


దక్షిణ మధ్య రైల్వేలో టీటీఈల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ద.మ. రైల్వేలో మొత్తం 4 వేల వరకు టీటీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని రైల్వే యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. రైల్వే నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్ ప్రయాణికుల టిక్కెట్లతో పాటు ఐడీ ఫ్రూఫ్ ను కూడా తనిఖీ చేయాల్సి రావడంతో ఒక్కోసారి టిక్కెట్ల చెకింగ్ అర్థరాత్రి వరకు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటోంది. రైల్వే డివిజన్ పరిధిలోని గుంతకల్, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల్లో టీటీఈల కొరత ఉందని, దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న టీటీఈల పనిభారం పెరుగుతోందని రైల్వే యూనియన్ నాయకులు చెప్పారు. టీటీఈ పోస్టులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని వారు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News