: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి ఉచిత దర్శనానికి 28 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో అద్దె గదులు దొరకక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.