: కేసీఆర్ విఫలమైతే ఊరుకోం: డీఎస్
టీఆర్ఎస్ మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఊరుకునేది లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఆకర్షణీయమైన హామీలు ఇవ్వడంతో టీఆర్ఎస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని అన్నారు. తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ క్లైమ్ చేసుకోవడంలో విజయం సాధించిందని ఆయన అంగీకరించారు. తెలంగాణ ఇచ్చింది సోనియా అయినప్పటికీ దానిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని... హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమైతే ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.