: సహారా గ్రూప్ కు కొత్త చిక్కులు!
సహారా గ్రూప్ కంపెనీకి కొత్త చిక్కొచ్చిపడింది. కంపెనీకి వ్యతిరేకంగా 'ముంబయి ఆర్ధిక నేరాల విభాగం' తాజాగా దర్యాప్తును ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తరపునే ఈ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పెట్టుబడిదారులను ఏవైనా విషయాలపై సహరా గ్రూప్ భయపెట్టిందా? లేదా? అనే అంశంపై ఈ విభాగం ప్రాధమికంగా దర్యాప్తు చేయనుంది. మూడు కోట్ల మంది ఇన్వెస్టర్లకు రూ.24 వేల కోట్లను చెల్లించాల్సిన కేసుతో సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్ ఇప్పటికే సతమతమవుతున్న సంగతి తెలిసిందే.