: జల్లికట్టు నిర్వహణపై అనుమతి కోరిన 18 పిటిషన్లు కొట్టివేత
తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన జల్లికట్టును నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ 2009 నుంచి పెండింగ్ లో ఉన్న పద్దెనిమిది పిటిషన్లను మద్రాస్ హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. ఇటీవల జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో సదరు విజ్ఞప్తులను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎద్దులతో నిర్వహించే ఈ జల్లికట్టు వల్ల పలువురికి తీవ్రంగా గాయాలవుతున్నాయని, అంతేగాక హాని కలిగించే జంతువులను ఉపయోగించడం నేరంగా పరిగిణించబడుతుందని మేలో కేంద్రం కోర్టు ముందు పేర్కొన్న సంగతి తెలిసిందే.