: ప్రిన్స్ బాటలో జూనియర్ ప్రిన్స్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు బాల నటుడిగానూ తన సత్తా ఘనంగా చాటుకున్న సంగతి తెలిసిందే. పాలుగారే పసిప్రాయంలోనే పలు చిత్రాల్లో పోరాటాలు, హీరోయిన్లతో డ్యాన్సులు చేసిన మహేశ్ అప్పట్లోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కూడా తండ్రి బాటలోనే నడిచేందుకు సై అంటున్నాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమా ద్వారా గౌతమ్ తెరంగేట్రం చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం గౌతమ్ కు ఆరేళ్ళు!
దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి సంబంధించి మహేశ్, గౌతమ్ లపై కొన్ని సీన్లను టెస్టు షూట్ చేశాడట. అన్నట్టు, ఈ సినిమాతో మహేశ్ బాబు సిక్స్ ప్యాక్ తో కనువిందు చేయనున్నాడు. ప్రస్తుతం వరల్డ్ క్లాస్ ట్రైనర్ క్రిస్ గెటిన్ సాయంతో ఫిజిక్ ను తీర్చిదిద్దుకునే పనిలో మహేశ్ బిజీగా ఉన్నాడు.