: ముగ్గురు అల్-జజీరా విలేకరులకు ఏడేళ్ల జైలు శిక్ష
అల్-జజీరా నెట్ వర్క్ కు చెందిన ముగ్గురు విలేకరులకు ఈజిప్టు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద సంబంధిత ఆరోపణలతో గతేడాది డిసెంబర్ లో ఆస్ట్రేలియన్ కరస్పాండెంట్ పీటర్ గ్రెస్ట్, కెనడియన్- ఈజిప్టు బ్యూరో అధ్యక్షుడు మహమ్మద్ ఫమీ, ఈజిప్టు ప్రొడ్యూసర్ బహెర్ మహమ్మద్ లకు ఈ రోజు కోర్టు శిక్ష విధించింది. వీరిలో ఇతర ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న మహమ్మద్ ఫమీకి మరో మూడేళ్లతో కలిపి పదేళ్ల పాటు శిక్ష వేసింది. మహ్మద్ మోర్సీ అధ్యక్షుడిగా పదవి నుంచి వైదొలగిన సమయంలో ఇస్లామిక్ మద్దతుదారులను సమూలంగా అరెస్టు చేసే క్రమంలో వీరు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.