: అంజలి ఉదంతంలో తెరపైకి బాబాయి
హీరోయిన్ అంజలి అదృశ్యం ఘటనలో ఆమె బాబాయి సూరిబాబు తెరపైకి వచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్ నిమిత్తం రెండ్రోజుల క్రితం హైదరాబాదులోని ఓ హోటల్ లో తామిద్దరం ఓ రూమ్ తీసుకుని ఉన్నామని తెలిపారు. అయితే, తాను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ఆమె కనిపించకుండా పోయిందని సూరిబాబు వెల్లడించారు. రిసెప్షన్ వద్ద హోటల్ సిబ్బందిని విచారించగా, ఇండికా కారులో వెళ్ళినట్టు చెప్పారని ఆయన తెలిపారు. కారులో ఆమెతో ఎవరు ఉన్నారో తనకు తెలియదని సూరిబాబు అన్నారు. ఆ సమయంలో అంజలి వద్ద హ్యాండ్ బాగ్, సెల్ ఫోన్ మాత్రమే ఉన్నాయని చెప్పారు.