: నల్లధనంపై స్విట్జర్లాండ్ కు లేఖ రాస్తాం: జైట్లీ
నల్లధనంపై స్విట్జర్లాండ్ కు లేఖ రాస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలు ఇవ్వాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. కాగా, ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా స్విస్ బ్యాంకుల్లో భారతీయుల లావాదేవీలకు సంబంధించిన వివరాలు భారత్ తో పంచుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్విస్ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత్ కోరితే వివరాలు అందజేస్తామని స్విస్ ప్రధాని గతంలో తెలిపారు.