: అర్జెంటీనా సాకర్ చీఫ్ కు 'మధ్య వేలు' చూపిన మారడోనా


అర్జెంటీనా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా మరోసారి వార్తల్లోకెక్కాడు. 'మారడోనా అర్జెంటీనా జట్టుకు పట్టిన దరిద్రం' అని అర్జెంటీనా ఫుట్ బాల్ సంఘం అధ్యక్షుడు జూలియో గ్రోండోనా వ్యాఖ్యానించాడు. దీనిపై మారడోనా తీవ్రంగా స్పందించాడు. ఓ లైవ్ టీవీ షోలో గ్రోండోనాను ఉద్దేశించి 'మధ్య వేలు' పైకెత్తి అసభ్యకర సంజ్ఞ చేశాడు. ఇరాన్ తో శనివారం జరిగిన వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లో అర్జెంటీనా 1-0తో విజయం సాధించి నాకౌట్ బెర్తు ఖాయం చేసుకుంది.

ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన మారడోనా మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మెస్సీ చేసిన అద్భుత గోల్ తో అర్జెంటీనా నెగ్గింది. ఈ నేపథ్యంలోనే గ్రోండోనా... మారడోనాను శనిగ్రహమని అభివర్ణించాడు. 'ఆ దరిద్రుడు మైదానం వీడి వెళ్ళాడు, మేం గెలిచాం' అని గ్రోండోనా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మారడోనా... 'మధ్య వేలు' పైకెత్తి చూపాడు.

  • Loading...

More Telugu News