: చెరువును ఆక్రమించారంటూ నాగార్జునపై లోకాయుక్తలో ఫిర్యాదు
సినీ నటుడు అక్కినేని నాగార్జునపై 'జనంకోసం' అనే స్వచ్ఛంధ సంస్థ లోకాయుక్తలో ఈ ఉదయం ఫిర్యాదు చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్ లో ఉన్న తుమ్మిడి చెరువును ఆక్రమించి, 'ఎన్ కన్వెన్షన్ సెంటర్' ను నిర్మించారని స్వచ్ఛంధ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. దీనిని స్వీకరించిన లోకాయుక్త, ఫిర్యాదులో పేర్కొన్న అంశంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.