: 33 రాయబార కార్యాలయాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని 33 దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలకు బాంబు బెదిరింపులతో కూడిన లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను పటిష్ఠం చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా రంగంలోకి దిగింది. లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దర్యాప్తు జరుపుతోంది.