: జగన్ సభలో రాజకీయ ప్రసంగం చేశారు: చంద్రబాబు
ప్రతిపక్ష నేత జగన్ సభలో రాజకీయ ప్రసంగం చేయడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బాబు మాట్లాడుతూ.. తొలిసారి ప్రసంగానికి జగన్ కొంత ప్రిపేర్ అయి వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. వాస్తవాలు వక్రీకరించి మాట్లాడటం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ప్రజలకు ఎలా సేవ చేయాలో తెలిసిన వ్యక్తిని కాబట్టే... తనను ప్రజలు గెలిపించారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వినియోగం ఆధారంగా విద్యుత్ ను విభజించడం అన్యాయమని కేంద్రాన్ని ప్రశ్నించినట్లు చంద్రబాబు తెలిపారు.