: నాగార్జున టీవీ షోకు టాప్ రేటింగులు
నటుడు నాగార్జున వ్యాఖ్యానంతో వస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే కార్యక్రమం రేటింగుల్లో దూసుకుపోతోంది. గత వారం ఈ కార్యక్రమం అత్యధికంగా స్థూల రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. 9.7 టెలివిజన్ వ్యూయర్ రేటింగ్ (టీవీఆర్) పాయింట్లు లభించాయి. మా టీవీలో వస్తున్న ఈ కార్యక్రమం... అమితాబ్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం తరహాలో గంటన్నరపాటు ఉంటుంది. గత రెండేళ్లలో ఈ స్థాయిలో రేటింగులు వచ్చిన కార్యక్రమం మరేదీ లేదని మా టీవీ ప్రకటించింది.