: నాపై దాడి జరుగుతుంటే... జగన్ చూస్తున్నాడు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు: మోదుగుల
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో తాను పోరాడుతుంటే... కాంగ్రెస్ ఎంపీలు మార్షల్స్ లా మారి తనపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల తెలిపారు. ఈ సందర్భంలో సభలోనే ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ చూస్తూ ఎంజాయ్ చేశాడే కాని... అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర విభజన గురించి మాట్లాడే నైతికత లేదని శాసనసభలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.