: తిరుమలలో రాజపక్సే పర్యటనలో ఉద్రిక్తత
తిరుమల అన్నమయ్య భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పర్యటనను వ్యతిరేకిస్తూ తమిళ సంఘాలు నల్లజెండాలతో నిరసన తెలిపాయి. రాజపక్సే కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు.
అంతకు ముందు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. రాజపక్సే రాకకు నిరసన తెలుపుతూ లీలామహల్ సెంటర్ దగ్గర డిఎంకె ప్రతినిధులు ఆందోళనకు దిగడంతో పోలీసులు పదిమంది డీఎంకె ప్రతినిధులను అరెస్టు చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండు దగ్గర కూడా 40 మంది ఎండీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి.