: కాశ్మీర్ విముక్తి కోసం ర్యాలీ... పోలీసుల ఆంక్షలు


జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ పట్టణంలో వాహనాల రాకపోకలు, పాదచారులపై పోలీసులు ఆంక్షలు విధించారు. వేర్పాటు వాద సంస్థ అయిన జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ యాసిన్ మాలిక్ 'క్విట్ కాశ్మీర్ ఉద్యమం' పేరుతో ర్యాలీ జరపనున్నారు. కాశ్మీర్ పై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కొనసాగించాలన్న అంశంపై చర్చకు వీలు కల్పించేలా క్విట్ కాశ్మీర్ ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలను శ్రీనగర్ పట్టణంలో మోహరించారు.

  • Loading...

More Telugu News