: అతి విశ్వాసమే మా కొంప ముంచింది: జగన్
ఎన్నికల్లో అతి విశ్వాసమే తమ గెలుపును తారుమారు చేసిందని వైకాపా అధినేత జగన్ అన్నారు. శాసనసభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు పలు అంశాలు టీడీపీ గెలుపుకు కారణమయ్యాయని తెలిపారు. రుణమాఫీ, మోడీ హవాతో పాటు మరి కొంత మంది వ్యక్తులు టీడీపీ గెలుపులో భాగస్వాములయ్యారని చెప్పారు. అయితే జనసేన అధినేత పవన్ పేరును మాత్రం ఆయన ఉచ్చరించలేదు. ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీకి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నామని చెప్పారు.