: ఎన్నికల వ్యూహంపై 12న టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో భేటీ


తెలంగాణ ఉద్యమంపై టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు కార్యాచరణ రచిస్తూనే ఉంది. అంతేకాదు, రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ అంశంతో జనాల్లోకి వెళ్లి పార్టీకి ప్రాభవాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటినుంచే పకడ్బందీ వ్యూహ ప్రణాళికను తయారు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఈనెల 12న హైదరాబాదు తెలంగాణ భవన్ లో పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుందని ప్రకటించింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల కమిటీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపింది. అంతేకాక, ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ, విధి విధానాలపై చర్చ జరుపుతామని చెప్పింది.

  • Loading...

More Telugu News