: యూపీలో మరో అరాచకం... ఏడేళ్ల బాలికపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ లో అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. అక్కడ మహిళలకే కాదు, బాలికలకూ రక్షణ లేకుండా పోతోంది. తాజాగా జరిగిన ఘటనలో ఏడేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ముజఫర్ నగర్ జిల్లాలో ఆదివారం నాడు బాలిక పొలాల సమీపంలోకి వెళ్లింది. అక్కడ ఓ బాలుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ బాలికను సమీపంలోని దట్టమైన చెట్లు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి నిందితులు వెళ్లిపోయారు.
ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన తల్లిదండ్రులకు... తీవ్ర రక్తస్రావమై పడి ఉన్న బాలిక కనిపించింది. వారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.