: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జులై 7 నుంచి ఆగస్టు 14 వరకూ సమావేశాలు జరగనున్నాయి. జులై 8న రైల్వే బడ్జెట్, 10న సాధారణ బడ్జెట్ లను ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. జులై 9న ఆర్థిక సర్వేను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.