: విమాన పరికరాల పరిశ్రమకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
రూ. 500 కోట్లతో ఏర్పాటవుతున్న డార్నియర్ విమాన పరికరాల పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని వైమానిక సెజ్ లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. టాటా, రుయాగ్ సంస్థలు సంయుక్తంగా ఈ పరిశ్రమను నిర్మిస్తున్నాయి.