: త్వరలో ఎల్జీ కళ్లద్దాల కంప్యూటర్


గూగుల్ పరిశోధనల పుణ్యమా అని కంప్యూటర్ చిన్నగా మారి కళ్లద్దాల్లో ఒదిగిపోయింది. ఇప్పుడు ఎల్జీ కంపెనీ కూడా ఇదే తరహాలో కళ్లద్దాల కంప్యూటర్ ను తీసుకురాబోతోంది. ఇందులో గ్లాస్ టిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఈ విషయాన్ని ఎల్జీ కంపెనీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. ఈ కళ్లద్దాల్లో చిన్నపాటి గాజులాంటి తెర, సీపీయూ, కెమెరా వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. కాల్స్ చేసుకోవడానికి, వీడియోలు చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఈ ఏడాదే మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News