: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై ఈ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం: వెంకయ్యనాయుడు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ రోజు ఢిల్లీలో మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రో పనితీరును అడిగి మరీ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మెట్రో సర్వీస్ అద్భుతంగా ఉందని అన్నారు. అయితే, ఛార్జీలను కొంత మేరకు తగ్గించాలని ఉందని మెట్రో అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖల్లో మెట్రో రైలు నిర్మాణం గురించి ఈ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయిస్తామని చెప్పారు.