: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై ఎల్ నినో ప్రభావం
అభివృద్ధి పేరుతో మనం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో చేటు తెస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీని ప్రభావంతో ఎల్ నినో (వర్షాభావం), లానినా (కుండపోత వర్షాలు) లాంటి వాతావరణ పరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన విషయానికి వస్తే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉంది. దీంతో ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి తగ్గలేదు. వర్షాల జాడ లేదు. దీని ప్రభావంతో రుతుపవనాల విస్తరణకు ప్రతిబంధకం ఏర్పడింది. వర్షాలు కురవకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.