ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు జరగనుంది. ఈ ఉదయం 11 గంటలకు ఉపసభాపతిని ఎన్నుకుంటారు. ఈ పదవికి టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో, ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.