: ఆర్టీపీపీలో విద్యుత్ సంక్షోభం
కడప ఆర్టీపీపీలో విద్యుత్ సంక్షోభం ముదిరింది. బొగ్గు కొరత తీవ్రం కావడంతో మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం ఆర్టీపీపీ నుంచి 240 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి తోడు విజయవాడ వీటీపీఎస్ లోనూ బొగ్గు నిల్వలు క్రమేణా తగ్గిపోతున్నాయి. దీంతో, అక్కడ కూడా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి అనుమానంగా మారింది. దేశంలో కొంతకాలంగా థర్మల్ ప్రాజెక్టులకు బొగ్గు కొరత నెలకొని ఉంది. ఆ ప్రభావమే ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ ప్రాజెక్టులపైనా పడిందని నిపుణులు భావిస్తున్నారు.