: ఆ ఒక్క దుకాణంలోనే కోటీ 15 లక్షల ఎరువులు దొరికాయి: విజిలెన్స్ అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని శ్రీరామా ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 574 టన్నుల ఎరువులు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు కోటీ 15 లక్షల రూపాయలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.