: హైదరాబాద్ చేరుకున్న మూడు మెట్రో రైళ్లు


హైదరాబాద్ కు మూడు మెట్రో రైళ్లు చేరుకున్నాయని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. దక్షిణకొరియా నుంచి చెన్నై వరకు సముద్ర మార్గంలో, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇవి హైదరాబాద్ చేరుకున్నాయి. కాగా, ఒక్కో రైల్లో మూడేసి బోగీలున్నాయి. ఒక్కో బోగీలో 330 మంది చొప్పున ఒక రైల్లో వెయ్యి మంది ఒకేసారి ప్రయాణం చేయచ్చని మెట్రో రైల్ అధికారులు తెలిపారు.

రైలు ఆగగానే తెరుచుకుని, మూసుకుపోయే ఆటోమేటిక్ డోర్లు, ఏసీ, మొబైల్, ల్యాప్ టాప్ లను ఛార్జింగ్ చేసుకోడానికి పాయింట్లు, ఇలా అన్ని సౌకర్యాలు బోగీల్లో కల్పించామని అధికారులు వెల్లడించారు. భద్రతా పరమైన పరీక్షలన్నీ పూర్తి చేసుకుని వచ్చే ఉగాది నాటికి మెట్రోరైల్ కూత పెడుతుందని అధికారులు తెలిపారు. నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మొదటి మెట్రో రైలు పరుగులు తీస్తుందని అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News