: నాగమల్లేశ్వరరావు కావాలంటే 6 కోట్లివ్వండి: బోడో తీవ్రవాదులు
అసోంలో అపహరణకు గురైన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఇంజనీర్ నాగమల్లేశ్వరరావును విడుదల చేసేందుకు 6 కోట్ల రూపాయలు చెల్లించాలని బోడో తీవ్రవాదులు డిమాండ్ చేశారు. వశిష్ట కన్ స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్న నాగమల్లేశ్వరరావును ఈ నెల 17న బోడో తీవ్రవాదులు అపహరించారు. ఆయనను విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.