: ముంబయి కళాకారుడికి అంతర్జాతీయ గుర్తింపు
ముంబైకి చెందిన కళాకారుడు ప్రకాశ్ బాల్ జోషి 'ఎథిక్స్ అడ్వైజర్ అండ్ అంబాసిడర్' గా నియమితులయ్యారు. కళ ద్వారా ప్రపంచ సమస్యలపై అవగాహన పెంపొందింపచేసేందుకు ఫ్రాన్స్ లోని పారిస్ కు చెందిన వరల్డ్ సిటిజెన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈ నియామకం జరిపింది. జోషి ఓ ఆంగ్ల దినపత్రికలో జర్నలిస్టుగా పని చేశారు. యూరప్, అమెరికా, టర్కీ, భూటాన్ లో జరిగిన అంతర్జాతీయ కళాప్రదర్శనల్లో తన చిత్రాలు ప్రదర్శించారు.