: బతికే ఉన్న... భార్యను చంపేశాడని జైలు శిక్ష అనుభవించాడు...ఇదో వింత
భార్యను కిడ్నాప్ చేసి హత్య చేశాడని ఓ వ్యక్తి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. విడుదలయ్యాక తన భార్య నిక్షేపంలా బతికే ఉందని తెలుసుకున్నాడు. దాంతో, ఏం చేయాలో అర్ధంకాక తలపట్టుకున్నాడు. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యను కిడ్నాప్ చేసి హత్య చేశాడని కేసు నమోదైంది. దీనిని విచారించిన న్యాయస్థానం అతనికి జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే విడుదలయ్యాడు. ఆ తరువాత అతని భార్య బతికే ఉందని తెలుసుకున్నాడు. ఆమె పుట్టింట్లో క్షేమంగా ఉందని, తాను ఎలాంటి నేరమూ చేయలేదని అయినా శిక్ష అనుభవించానంటూ మీడియాతో గోడు వెళ్లబోసుకున్నాడు. దీనిపై న్యాయనిపుణులు స్పందించాల్సి ఉంది.