: 'సత్యం' కేసులో తీర్పుపై రేపు నిర్ణయం!
సంచలనం సృష్టించిన 'సత్యం' కుంభకోణం కేసులో తీర్పుపై రేపు నిర్ణయం వెలువడే అవకాశముంది. కోట్ల రూపాయలను సర్దుబాటు చేసేందుకు కంపెనీ ఖాతాలను తారుమారు చేసినట్టు 2009లో సాక్షాత్తు సంస్థ వ్యవస్థాపకుడు రామలింగరాజు మీడియా ఎదుట చెప్పడం అప్పట్లో సంచలనం కలిగించింది. దీంతో, ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు 216 మంది సాక్షులను విచారించడంతోపాటు 3038 పత్రాలను పరిశీలించింది. గతవారమే విచారణ పూర్తి చేసిన కోర్టు రేపు తీర్పు తేదీని వెల్లడించనుంది.