: రఘువీరారెడ్డి కూడా నీతులు చెబుతున్నారు: కాల్వ శ్రీనివాసులు


ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా నీతులు చెబుతున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో కార్యకర్తల నుంచి ఓ స్థాయి నేతలను బెదిరించి పార్టీలు మార్పించిన చరిత్ర ఎవరిదో తరచి చూసుకోవాలని చురక అంటించారు. పార్టీలు మారే సంస్కృతిని ప్రోత్సహించే పార్టీ ఎవరిదో వెనక్కి తిరిగి చూసుకోవాలని అన్నారు. టీడీపీ ఎవరినీ ప్రలోభ పెట్టలేదని, ఎన్నికల ముందు పార్టీ వీడినవారు, టీడీపీతో మంచి జరుగుతుందని భావించిన వారు తమతో కలసి వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

విభజన సందర్భంగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన రఘువీరారెడ్డి ఏం చేయాలో, నేతల్ని ఎలా ఆపాలో తెలియక తమపై అభాండాలు వేస్తున్నారని కాల్వ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంగతి ప్రజలు గ్రహించారని, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ చేసిన అవమానం, అన్యాయం వారు గుర్తుంచుకున్నారని అన్నారు. మునిగిపోయిన నావలో ఉన్న రఘువీరారెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఆరోపణలు చేయడం కేవలం ఉనికిని చాటుకునేందుకేనని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News